ధర్మ రాహిత్యం, నాస్తికత్వం ఒక సమీక్ష..!
ధర్మ రాహిత్యం ఒక సమీక్ష..! ”మా వాక్యాల విషయంలో వక్ర వైఖరిని అవలంబింస్తున్న వారు మా దృష్టిలో లేకుండా లేరు”. (ఫుస్సిలత్: 40) ధర్మ రాహిత్యం - నాస్తికత్వాన్ని అరబీలో ఇల్హాద్ అంటారు. ఇల్హాద్ అంటే, విషయాన్ని దాని సందర్భం నుండి తప్పించి వివరించడం. అలా తమ తప్పుడు విశ్వాసాలను, మిథ్యా సిద్ధాంతాలను నిజమయినవిగా రూఢీ చేసుకోవడానికి ఖుర్‌ఆన్ వాక్యాలకు వక్ర భాష్యం చెప్పేవారు, అల్లాహ్ నామాలు, గుణగణాల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకునే వారు కూడా ఇందులో వస్తారు. అయితే నేడు ఈ పదం మత రాహిత్యం, నిజ దైవం యెడల నమ్మకం లేకపోవడం అన్న అర్థంలోనే ఎక్కువగా వాడబడుతున్నది. విశ్వ ప్రభువయిన అల్లాహ్ సమస్త మానవాళి కోసం ఆకాశం నుండి అవతరింపజేసిన ధర్మ విశ్వాసాలు మూడు మౌలిక విషయాల మీద ఆధార పడి ఉన్నాయి. 1) తౌహీద్ – నిజ దేవుని ఏకత్వం. 2) రిసాలత్ – ఆ నిజ దేవుని తరఫున దౌత్యం. 3) ఆఖిరత్ – పరలోక జీవితం. ఈ మౌలిక విశ్వాసాల్లోని ఏ ఒక్క విషయాన్ని తిరస్కరించినా దాన్ని ఇల్హాద్ – నాస్తికత్వం అంటారు. ఇలాంటి వితండవాదం చేసే వారిని ఖుర్‌ఆన్ దహ్‌రియా అని కూడా నామకరణం చేస్తుంది: ”మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే. మేము ...