Posts

Showing posts from August, 2024

విద్యా కుసుమాల్ని విశ్వవ్యాప్తంగా వికసింపజేసిన విలక్షణ వ్యక్తిత్వం కాకా సయీద్ (రహ్మ) గారిది

Image
నిన్న కాక మొన్నే కదా అభ్యుదయ కాకాని  మధ్యలో  పెట్టుకుని ఆనందంగా ఫోటో దిగింది అదే ఆయనతో ఆఖరి చిత్రమని ఈ ఉదయపు విషాదవార్త తేల్చింది గుండెల్లో తన కళాశాలను  స్వప్నించేవారు ఆ నేల మట్టి పరిమళాన్ని ధ్యానించేవారు కనుకే- ఇవాళ అందరూ తను మృదుభాషి అంటున్నారు గొప్ప దార్శనికుడు, తపస్వీ, యశస్వీ అని వేనోళ్ళా కీర్తిస్తున్నారు. కరుణతోనే సమకాలీన ముస్లిం సమాజం మీద తన దు:ఖాన్ని,ఆవేదనను, ఆవేశాన్ని, ప్రేమనీ తన శ్రేయ  మూటలో దాచగలిగారు  కదా విద్యా   పరిమళాలు గుబాళించినంత కాలం కాకాకు  మరణ మెక్కడిది..? ఆయన వెలిగించిన విద్యా దీపాలు లేని దేశం ఒక్కటయినా ప్రపంచంలో ఉందా? జీవిత కాలం పాటు మధ్యేమార్గాన్ని ఆయుధంగా  చేసుకుని కాలాన్ని, కలాన్ని,  కలంకారుల్ని చిగురింపజేసిన కాలమాన్యులు కాకా సయీద్ (రహ్మ) విద్యాభ్యాసమే కాదు విద్యావేత్తలుగా ఎదగాలన్నారు విద్యార్థి ప్రపంచానికి కొత్త చూపునిచ్చి సౌమనస్యానికి ఊపిరి పోశారు, వైమనశ్య ఊపిరి తీసి  సంతులనాన్ని స్థాపించారు సంచలనాలెన్నో సృష్టించారు 83 ఏండ్ల తన సుదీర్ఘ బతుకుయానంలో చూసిన ఆగని  పంథా పరమైన పాక్షిక  విభేదాల  గురించి ...