Posts

ధర్మ రాహిత్యం, నాస్తికత్వం ఒక సమీక్ష..!

Image
ధర్మ రాహిత్యం ఒక సమీక్ష..! ”మా వాక్యాల విషయంలో వక్ర వైఖరిని అవలంబింస్తున్న వారు మా దృష్టిలో లేకుండా లేరు”. (ఫుస్సిలత్‌: 40) ధర్మ రాహిత్యం - నాస్తికత్వాన్ని అరబీలో ఇల్హాద్‌ అంటారు. ఇల్హాద్‌ అంటే, విషయాన్ని దాని సందర్భం నుండి తప్పించి వివరించడం. అలా తమ తప్పుడు విశ్వాసాలను, మిథ్యా సిద్ధాంతాలను నిజమయినవిగా రూఢీ చేసుకోవడానికి ఖుర్‌ఆన్‌ వాక్యాలకు వక్ర భాష్యం చెప్పేవారు, అల్లాహ్‌ నామాలు, గుణగణాల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకునే వారు కూడా ఇందులో వస్తారు. అయితే నేడు ఈ పదం మత రాహిత్యం, నిజ దైవం యెడల నమ్మకం లేకపోవడం అన్న అర్థంలోనే ఎక్కువగా వాడబడుతున్నది. విశ్వ ప్రభువయిన అల్లాహ్‌ సమస్త మానవాళి కోసం ఆకాశం నుండి అవతరింపజేసిన ధర్మ విశ్వాసాలు మూడు మౌలిక విషయాల మీద ఆధార పడి ఉన్నాయి. 1) తౌహీద్‌ – నిజ దేవుని ఏకత్వం. 2) రిసాలత్‌ – ఆ నిజ దేవుని తరఫున దౌత్యం. 3) ఆఖిరత్‌ – పరలోక జీవితం. ఈ మౌలిక విశ్వాసాల్లోని ఏ ఒక్క విషయాన్ని తిరస్కరించినా దాన్ని ఇల్హాద్‌ – నాస్తికత్వం అంటారు. ఇలాంటి వితండవాదం చేసే వారిని ఖుర్‌ఆన్‌ దహ్‌రియా అని కూడా నామకరణం చేస్తుంది: ”మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే. మేము ...

ప్రమాణం - ప్రణామం / Oath, Bowing

Image

మేం యువకులం

Image
అంశం: *దేశాభివృద్ధిలో యువత పాత్ర* మనస్సు లోపలి తమస్సు తొలగించి అణగారిన సత్యాగ్ని కణం రగిలించి మమతానురాగాల దివ్వెలు వెలిగించి కష్ట జనులకై లేచు కరుణ కెరటంలాగా దుష్ట జనులకై మండు నరక కూపంలాగా మేం పోరాటానికి సిద్ధం గెలుపు మాకు తధ్యం మేం భావి భారత పౌరులం - మాకు లేదు ఏ కులం మేం ఈ దేశ భవుకులం - మాకు లేదు ఏ మతం ధరిత్రి దశ దిశల ధర్మ తేజ తోరణాలు కట్టి మనిషి బ్రతుక్కొక లక్ష్యం పెట్టి, శ్రుతి చుట్టి మాట మాటకి మంచి బాట లాగ అడుగు అడుగుకి ఆదర్శ మూట లాగ మేం రాజ్యాగాన్ని శ్వాసిస్తాం మేం సుమనస్కులం - కర్కశకం కాదు మా గుణం పైశాచిక పోకడల పొత్తి కడుపుల్లో కత్తులు దూసి భుక్త భక్తుల లోగుట్టుని బయటపెట్టి రక్తసిక్త చరిత్ర రసికుల్ని మట్టుపెట్టి రోత, రోధ, రసూముల రొంపిని పూడ్చి పెట్టి మేం కాంతికారులై వెలుగుతాం మేం క్రాంతి వీరులై ఎదుగుతాం పేరు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ

మనిషి మహా ఆత్రగాడు

Image
నీ పయనం ఎటు..? తాడోపేడో తేలిపోవాలంటాడు. కోరికో కామమో ఎలాగయినా తీరిపోవాలి. ధనమో ఇంధనమో ఎలాగోలా వచ్చి పడాలి. స్వ ర్గమో నరకమో ఇక్కడే అనుభవించాలి చెడో చీకటో ఏదొకటి కావాలి. కత్తో సుత్తో ఏదొకటి పట్టాలి హత్యో హోమమో ఏదొకటి చేయాలి రచ్చో చిచ్చో దేన్నోకటి రగలించాలి. అపశృతో అపశుభమో ఏదోకటి వాగాలి. కట్నమో కాష్టమో ఏదోకటి తేలాలి సారాయో బ్రాందో ఏదోకటి తాగాలి పసికందో పండు ముసలో ఎవరొకర్ని చెరచాలి అలా కాక మనో తుచ్చ వాంఛల దాస్యం మాని మాధవుడు చూపిన బాటన నడిస్తే లక్షల్ని కాదు లక్ష్యాల్ని సాధిస్తే ఇజానికి కాదు నిజానికి ఓటేస్తే నేటి పౌరులంతా లోక కళ్యాణాన్ని సత్సమాజ స్వాప్నిక జగత్తును యదార్థం చేసే రథసారథులవుతారు. పేరు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ

చాలా చీకటిగా ఉంది

Image
అంశం: వెలుగు చీకట్లు ఆత్మజ్యోతిని వెలిగించండి! చాలా చీకటిగా ఉంది ముఖం మీద ముసుగును తీయండి! చాలా చీకటిగా ఉంది చీకటీ వేస్తున్న ప్రణాళికలో ప్రతిభ కాదు కావలసింది పలుకుబడి మనుషులు ప్రేమించడం, జీవించడం కాదు దాని సంస్కృతి ద్వేషించటం, నటించటం వివేక కిరణాన్ని మేల్కొల్పండి! చాలా చీకటిగా ఉంది మత్తెక్కిన విద్యా విజ్ఞానాలు మానవత్వానికి మంటలు పెడుతున్నాయి. ప్రాథమిక హక్కుల వృక్షాల మీద పల్లవిస్తున్న అవకాశాల ఆకుల్ని మేక తోలు కప్పుకున్న తోడేళ్ళు మేసేస్తున్నాయి. ధర్మ దీపాలు వెలిగించండి! చాలా చీకటిగా ఉంది కారుచీకటి నేలదున్ని కాంతిని పండించవలసిన పురుషోత్తములు ఉత్త పుర ప్రముఖులవుతున్నారు పేరాశ విషప్రేతాలు ప్రళయతాండవం చేస్తుంటే శిక్షించవలసిన ప్రజాస్వామ్య పుంగవులు పస లేని ప్రాణులుగా ప్రణమిల్లుతున్నారు విప్లవ శంఖం పూరించండి! చాలా చీకటిగా ఉంది శాంతి తం త్రి నిందించండి! చాలా చీకటిగా ఉంది హామీ పత్రం: ఇది నా స్వీయ రచన పేరు: శాంతి ప్రియ

జై కొట్టు... మీసం మెలి పెట్టు

Image
దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎక్కడికి పోతున్నాడు యువకుడు? ఎక్కవలసిన సుకీర్తి శిఖరాలపైకా దిక్కుమాలిన పాపాల నరక కూపాల్లోకా ఎక్కడికి పోతున్నాడు? ఏ సుడిగుండాల్లో చిక్కుకుపోతున్నాడు? సత్య యుగం నుంచి మిథ్యా లోకంలోకి దూకి, మిథ్యాలోకంలోంచి రాకెట్‌ యుగానికి ఎగబ్రాకి మళ్ళీ వెనక్కి నడుస్తున్నావా మనుషుల్ని మనుషులే తిన్న అమానుష బర్బరయుగంలోకి అసభ్యతా విష ప్రభంజనం ఆకులు రాల్చిన జజ్జర యుగంలోకి. ఇన్ని మరకలా? ఈ అద్దానికి ఇకనయినా తుడిచి పెట్టు ఇన్ని రుచులా? ఈ దేహానికి ఇకనయినా వదలి పెట్టు పోగుల్లాగా తెగిపోతున్న హృదయాల్ని ముడిపెట్టు పరిస్థితి విషమించక ముందే చేయందించి నిలబెట్టు తీవెల్లే ఒదిగే పచ్చని భావాలకు శ్రుతి కట్టు దమన నీతి సాగించే మానవ సైతానుల భరతం పట్టు మానవ జాతి విముక్తికి నెత్తుట తడిసిన సత్యకేతనానికి జైకొట్టు సహనాన్ని మడిచి పెట్టీ సవాలంటూ తొడగొట్టు. అణ్వస్త్రాలతోపాటు అంతరాలు అంతమవ్వాలి గ్రహాలతోపాటు ఆగ్రహాలను గెలవాలి చెట్టాపట్టాలు పట్టుకున్న సౌజన్యం పట్టాలపై పయనించాలి ప్రతి అధరంపై దరహాసం చిందాలి. ప్రతి బీడులో మమతల మల్లెలు పూయాలి. పేరు: శాంతి పియ్ర

పంజరంలో పక్షి.....

Image
అంశం: *నేటి భారతం* మనిషితనం అంతరించే అవనీతలాన మృగత్త్వం తాండవించే మణిపూర్ హర్యానా మానవత్వం మంటగలిసే నేటి భారతాన దానవత్వం హూంకరించే ఈ జగాన మెడికల్ మాఫియా ఈ గట్టు భూ మాఫియా ఆ గట్టు విద్యా మాఫియా ఈ గట్టు డ్రగ్స్ మాఫియా ఆ గట్టు ఈ గట్టు గుట్టు తెలియని మనిషికి తీరని గాట్లు నేటి భారతానా ఇవే సగటు పౌరుని అగచాట్లు నింగి నేల గాలి నీరు చదువు చరిత అంతా కాలుష్యమయం విలువల వలివల్ని వలిచివేస్తున్న విష స్వరూపుల విధ్వంశం అడుగుతొంది భారత దేశం ఈ భయపీడిత వాతాతవర ణం దేనికి? అధికార మదంతో ఆదివాసీలతో ఆటాడుకోవడం దేనికి? పదవీ వ్యామోహంతో గల్లీ గల్లీలో ఈ రక్తపుటే ర్లు దేనికి? ఒకప్పటి బంగరు పక్షిని పంజరంలో పక్షిని చేశారెందుకు? అందుకే కలిసి కదలాలి మనమందరం జై కిసాన్ జై జవ్వాన్ అవ్వాలి మన నినాదం చేటు చేసే చట్టాలకు పాడాలి చమరగీతం దేశ సుభిక్షత కోసం సమిదిలా నిలవాలి మనం దేశ సంక్షేమం కోసం ఫిరంగిలా మారాలి మనం పేరు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ