చాలా చీకటిగా ఉంది

అంశం: వెలుగు చీకట్లు
ఆత్మజ్యోతిని వెలిగించండి! చాలా చీకటిగా ఉంది ముఖం మీద ముసుగును తీయండి! చాలా చీకటిగా ఉంది చీకటీ వేస్తున్న ప్రణాళికలో ప్రతిభ కాదు కావలసింది పలుకుబడి మనుషులు ప్రేమించడం, జీవించడం కాదు దాని సంస్కృతి ద్వేషించటం, నటించటం వివేక కిరణాన్ని మేల్కొల్పండి! చాలా చీకటిగా ఉంది మత్తెక్కిన విద్యా విజ్ఞానాలు మానవత్వానికి మంటలు పెడుతున్నాయి. ప్రాథమిక హక్కుల వృక్షాల మీద పల్లవిస్తున్న అవకాశాల ఆకుల్ని మేక తోలు కప్పుకున్న తోడేళ్ళు మేసేస్తున్నాయి. ధర్మ దీపాలు వెలిగించండి! చాలా చీకటిగా ఉంది కారుచీకటి నేలదున్ని కాంతిని పండించవలసిన పురుషోత్తములు ఉత్త పుర ప్రముఖులవుతున్నారు పేరాశ విషప్రేతాలు ప్రళయతాండవం చేస్తుంటే శిక్షించవలసిన ప్రజాస్వామ్య పుంగవులు పస లేని ప్రాణులుగా ప్రణమిల్లుతున్నారు విప్లవ శంఖం పూరించండి! చాలా చీకటిగా ఉంది శాంతి తం త్రి నిందించండి! చాలా చీకటిగా ఉంది హామీ పత్రం: ఇది నా స్వీయ రచన పేరు: శాంతి ప్రియ

Comments

Popular posts from this blog

జై కొట్టు... మీసం మెలి పెట్టు

మనిషి మహా ఆత్రగాడు