మనిషి మహా ఆత్రగాడు
నీ పయనం ఎటు..?
తాడోపేడో తేలిపోవాలంటాడు.
కోరికో కామమో
ఎలాగయినా తీరిపోవాలి.
ధనమో ఇంధనమో
ఎలాగోలా వచ్చి పడాలి.
స్వ ర్గమో నరకమో
ఇక్కడే అనుభవించాలి
చెడో చీకటో ఏదొకటి కావాలి.
కత్తో సుత్తో ఏదొకటి పట్టాలి
హత్యో హోమమో ఏదొకటి చేయాలి
రచ్చో చిచ్చో దేన్నోకటి రగలించాలి.
అపశృతో అపశుభమో ఏదోకటి వాగాలి.
కట్నమో కాష్టమో ఏదోకటి తేలాలి
సారాయో బ్రాందో ఏదోకటి తాగాలి
పసికందో పండు ముసలో ఎవరొకర్ని చెరచాలి
అలా కాక మనో తుచ్చ వాంఛల దాస్యం మాని
మాధవుడు చూపిన బాటన నడిస్తే
లక్షల్ని కాదు లక్ష్యాల్ని సాధిస్తే
ఇజానికి కాదు నిజానికి ఓటేస్తే
నేటి పౌరులంతా లోక కళ్యాణాన్ని
సత్సమాజ స్వాప్నిక జగత్తును
యదార్థం చేసే రథసారథులవుతారు.
పేరు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ

Comments
Post a Comment