జై కొట్టు... మీసం మెలి పెట్టు
దేశాభివృద్ధిలో యువత పాత్ర
ఎక్కడికి పోతున్నాడు యువకుడు?
ఎక్కవలసిన సుకీర్తి శిఖరాలపైకా
దిక్కుమాలిన పాపాల నరక కూపాల్లోకా
ఎక్కడికి పోతున్నాడు?
ఏ సుడిగుండాల్లో చిక్కుకుపోతున్నాడు?
సత్య యుగం నుంచి మిథ్యా లోకంలోకి
దూకి, మిథ్యాలోకంలోంచి రాకెట్ యుగానికి
ఎగబ్రాకి మళ్ళీ వెనక్కి నడుస్తున్నావా
మనుషుల్ని మనుషులే తిన్న
అమానుష బర్బరయుగంలోకి
అసభ్యతా విష ప్రభంజనం
ఆకులు రాల్చిన జజ్జర యుగంలోకి.
ఇన్ని మరకలా? ఈ అద్దానికి ఇకనయినా తుడిచి పెట్టు
ఇన్ని రుచులా? ఈ దేహానికి ఇకనయినా వదలి పెట్టు
పోగుల్లాగా తెగిపోతున్న హృదయాల్ని ముడిపెట్టు
పరిస్థితి విషమించక ముందే చేయందించి నిలబెట్టు
తీవెల్లే ఒదిగే పచ్చని భావాలకు శ్రుతి కట్టు
దమన నీతి సాగించే మానవ సైతానుల భరతం పట్టు
మానవ జాతి విముక్తికి నెత్తుట తడిసిన సత్యకేతనానికి జైకొట్టు
సహనాన్ని మడిచి పెట్టీ సవాలంటూ తొడగొట్టు.
అణ్వస్త్రాలతోపాటు అంతరాలు అంతమవ్వాలి
గ్రహాలతోపాటు ఆగ్రహాలను గెలవాలి
చెట్టాపట్టాలు పట్టుకున్న సౌజన్యం
పట్టాలపై పయనించాలి
ప్రతి అధరంపై దరహాసం చిందాలి.
ప్రతి బీడులో మమతల మల్లెలు పూయాలి.
పేరు: శాంతి పియ్ర
Comments
Post a Comment