మేం యువకులం

అంశం: *దేశాభివృద్ధిలో యువత పాత్ర*
మనస్సు లోపలి తమస్సు తొలగించి అణగారిన సత్యాగ్ని కణం రగిలించి మమతానురాగాల దివ్వెలు వెలిగించి కష్ట జనులకై లేచు కరుణ కెరటంలాగా దుష్ట జనులకై మండు నరక కూపంలాగా మేం పోరాటానికి సిద్ధం గెలుపు మాకు తధ్యం మేం భావి భారత పౌరులం - మాకు లేదు ఏ కులం మేం ఈ దేశ భవుకులం - మాకు లేదు ఏ మతం ధరిత్రి దశ దిశల ధర్మ తేజ తోరణాలు కట్టి మనిషి బ్రతుక్కొక లక్ష్యం పెట్టి, శ్రుతి చుట్టి మాట మాటకి మంచి బాట లాగ అడుగు అడుగుకి ఆదర్శ మూట లాగ మేం రాజ్యాగాన్ని శ్వాసిస్తాం మేం సుమనస్కులం - కర్కశకం కాదు మా గుణం పైశాచిక పోకడల పొత్తి కడుపుల్లో కత్తులు దూసి భుక్త భక్తుల లోగుట్టుని బయటపెట్టి రక్తసిక్త చరిత్ర రసికుల్ని మట్టుపెట్టి రోత, రోధ, రసూముల రొంపిని పూడ్చి పెట్టి మేం కాంతికారులై వెలుగుతాం మేం క్రాంతి వీరులై ఎదుగుతాం పేరు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ

Comments

Popular posts from this blog

జై కొట్టు... మీసం మెలి పెట్టు

చాలా చీకటిగా ఉంది

మనిషి మహా ఆత్రగాడు