పంజరంలో పక్షి.....
అంశం: *నేటి భారతం*
మనిషితనం అంతరించే అవనీతలాన
మృగత్త్వం తాండవించే మణిపూర్ హర్యానా
మానవత్వం మంటగలిసే నేటి భారతాన
దానవత్వం హూంకరించే ఈ జగాన
మెడికల్ మాఫియా ఈ గట్టు భూ మాఫియా ఆ గట్టు
విద్యా మాఫియా ఈ గట్టు డ్రగ్స్ మాఫియా ఆ గట్టు
ఈ గట్టు గుట్టు తెలియని మనిషికి తీరని గాట్లు
నేటి భారతానా ఇవే సగటు పౌరుని అగచాట్లు
నింగి నేల గాలి నీరు చదువు చరిత అంతా కాలుష్యమయం
విలువల వలివల్ని వలిచివేస్తున్న విష స్వరూపుల విధ్వంశం
అడుగుతొంది భారత దేశం ఈ భయపీడిత వాతాతవర ణం దేనికి?
అధికార మదంతో ఆదివాసీలతో ఆటాడుకోవడం దేనికి?
పదవీ వ్యామోహంతో గల్లీ గల్లీలో ఈ రక్తపుటే ర్లు దేనికి?
ఒకప్పటి బంగరు పక్షిని పంజరంలో పక్షిని చేశారెందుకు?
అందుకే కలిసి కదలాలి మనమందరం
జై కిసాన్ జై జవ్వాన్ అవ్వాలి మన నినాదం
చేటు చేసే చట్టాలకు పాడాలి చమరగీతం
దేశ సుభిక్షత కోసం సమిదిలా నిలవాలి మనం
దేశ సంక్షేమం కోసం ఫిరంగిలా మారాలి మనం
పేరు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ

Comments
Post a Comment