వేలు పెట్టక ముందు వెయ్యి సార్లు ఆలోచించు
.* *అంశం: ఓటు నీ ఆయుధం*
కొత్త పాత్రలు వేదిక మీదికి వస్తూనే ఉంటాయి
నాటకం మాత్రం పాతదే ప్లే చేయబడుతుంది
ముళ్ళ బాటన సాగుతున్నాను నన్ను నేను కాపాడుకుంటూ
పాపిష్టి పాడు రాజకీయాలు నాకు కొత్తేమీ కాదు
నిజాన్ని అర్థం చేసుకోవడానికి రాజకీయాలు అనుమతించవు
మన ముఖం మనకే కన్పించదు మనల్ని మనమే గుర్తించలేము
క్షణక్షణం రంగు మారే ఊసరవెల్లి తనని తెలుసు
కానీ తనదే చాలా ప్రభావవంతమైన ముఖం
మనో వాంఛలే పాలన సాగిస్తున్నాయి
దొంగలే దొరలుగా చెలామణవుంతున్నారు
వారు కొంగ్రొత్త జిమ్మిక్కులు చూపుతూనే ఉన్నారు
చప్పట్లు కొట్టి ప్రజలే అలసిపోతున్నారు
వొట్టి కుర్చీ మాత్రమే మీ పాడే కాదుగా
ఏమీ చేతకానప్పుడు దిగిపోరెందుకు?
ప్రతి చోటా ప్రతిధ్వనిస్తున్న మాట
మీ నుండి మాకు ఏమీ అక్కర్లేదు
దయచేసి మాకు మాత్రమే ఓటు వేయండి
నేను ఓటు ఎవరికి వేయాలి?
నా ఓటు జన్మభూమిని పుణ్యభూమిని చేసే వారికే
బడుగు బలహీనుల భవిష్యత్తును బంగారం చేసే వారికే
మృగత్వం మెడలు వంచి మానవత్వాన్ని గెలిపించేవారికే
అశాంతిని అంతమొందించి శాంతి తంత్రీ నిందించే వారికే
పేరు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ

Comments
Post a Comment