మేం భారతీయులం
అంశం: నేను భారతీయుడిని
శీర్షిక: మేం భారతీయులం
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ
మేం భారతీయులం - విశ్వ జన శ్రేయోకాముకులం
మనస్సు లోపలి తమస్సు తొలగించి
అణగారిన సత్యాగ్ని కణం రగిలించి
మమతానురాగాల దివ్వెలు వెలిగించి
కష్ట జనులకై లేచు కరుణ కెరటంలాగా
దుష్ట జనులకై మండు సూర్య బింబంలాగా
మేం పోరాటానికి సిద్ధం - గెలుపు మాకు తథ్యం!
పైశాచిక పోకడల పొత్తి కడుపుల్లో కత్తులు దూసి
భుక్త భక్తుల లోగుట్టుని బయటపెట్టి
రక్త సిక్త చరిత్ర రసికుల్ని మట్టుపెట్టి
రోత, రోధ, రసూముల రొంపిని పూడ్చి పెట్టి
మేం కాంతికారులై వెలుగుతాం - మేం క్రాంతి వీరులై ఎదుగుతాం
మేం సుమనస్కులం - కర్కశకం కాదు మా గుణం
మేం సాత్వికులం - తామసం కాదు మా లక్షణం
మేం భారతీయులం - సమరస క్షేత్ర శ్రామికులం
మేం విభజించి పాలించు విధానానికి విరోధులం
మేం వర్గ, వర్ణ, ,మత పీడనలు సహించం
విశ్వ మానవ సౌభ్రాతృత్వ్యం మా ఆశ ఆశయం
విశ్వ మానవ కణ్యాణం మా మా జీవిత లక్ష్యం
మూఢ నమ్మకాల బూజు దులిపి, మానవత్వపు దివ్వెలు వెలిగించి
తూటాలకు ఎదురొడ్డి.. తీవ్రవాదుల పీచమణిచి
స్వార్థ సంకుచితల చిచ్చు నార్పి
మేం చైతన్య రథసారధులం - సత్సమాజ స్థాపనే మా ధ్యేయం
ఇందుగ్గాను -
నిలవాలి మనమందరం దేశానికి అండగా!
లేదంటే మనందరి బ్రతుకులు దండగా!!

Comments
Post a Comment