అద్భుత మంత్రం చిరునవ్వు

శీర్షిక: అద్భుత మంత్రం!
సామాన్యుడన్నాడు: కారు మేఘాలు క్రమ్ముకుంటూన్నాయి కష్టాల కడగండ్లు ముసురుకుంటున్నాయి అని నేనున్నాను: కరుపు కరువు ఉండని నవ్వవయ్యా బాబూ అని వృధుడన్నాడు: బేటా! ఆరోగ్యం క్షీణించుకుపోతున్నది ఇక నా కథ కంచికే నేను మాత్రం మింటికే అని నేనున్నాను: గయా కల్ ఫిర్ ఆతా నహీ నవ్వవయ్యా తాతా అని యువకుడన్నాడు: నా ప్రేమ నన్ను వీడి పోయింది నా బతుకుని బుగ్గిపాలు చేసినది, చేసుకున్న బాసలు చెరిగిపోయాయి నా గూడు చెదిరింది, నా గుండె పగిలింది నేనెలా నవ్వాలి? అని నేనున్నాను: ఈ క్షణం కూడా దాటిపోతుంది నవ్వవయ్యా బాబూ అని ఆమె అన్నది: సంసారం ఒక చదరంగం పెద్ద జంఝాటం కంటికి కునుకు లేదు ఒంటికి ఓరిమి లేదు అని నేనన్నాను: జీవితం అంటేనే పోరాటం నవ్వవమ్మా చెల్లీ అని అతనన్నాడు: శత్రువులు నన్ను చుట్టుముట్టారు, మతమౌఢ్య ముష్కరులు మంది మార్బలంతో ముట్టడించారని నేనన్నాను: నూరు గొడ్లను తిన్న రాబందు అయినా ఒక్క తుపానుకు కుప్పకూలడం ఖాయం..నవ్వవయ్యా బాబూ అని కడుపేదన్నాడు: తినడానికి కూడు లేదు ఉండటానికి గూడు లేదు తొడుక్కోవడానికి గుడ్డ లేదు, జేబులో ఒక చిల్లిగవ్వ కూడా లేదు అని నేనున్నాను: ప్రాణముందిగా పరేషాన్ అవ్వకు ప్రయత్నించు సహాయం చేసే మనసు నీది నవ్వవయ్యా బాబూ అని బయటికీ నువ్వు ఎంత నవ్వుతూ ఉన్నా సరే మనసులో అది లేకపోవడం నిజంగా బాధాకరం అని నవ్వు నవ్వించు నవ్వుతూ జీవించు అని పేరు: శాంతి ప్రియ

Comments

Popular posts from this blog

జై కొట్టు... మీసం మెలి పెట్టు

చాలా చీకటిగా ఉంది

మనిషి మహా ఆత్రగాడు