మేము నీ బిడ్డలమే

భారత దేశ ప్రజల మైన మేము
ఈ దేశ ప్రజలమైన మేము దేశ సేవలో తరిస్తాం ఏదో ఒక రోజు ఈ భూమిని స్వర్గంగా మారుస్తాం హృదయాల్లో దేశాభిమానం ఉంటే ఐక్యంగా ఉండండి కలిసి ఉంటేనే ఈ పూదోట పచ్చగా ఉంటుంది ఇచ్చోటనే ఈ దినానే ఈ ప్రకటన జరిగింది చీకట్లు ఓడిపోయాయి వెలుగులు విరబూశాయి జై హింద్ అన్న నినాదాలు మిన్నంటాయి స్వేచ్చా స్వాతంత్రయాలు సిద్ధించాయి నా జన్మ భూమి మట్టి మీద మడమలను రుద్దనివ్వండి ఇక్కడి నుండి జలనిధి పెల్లుబుకుతుందన్న నమ్మకం నాకుంది మాతృభూమి రక్షణ తన, ధన,మానాలకంటే మహోత్కృష్టమైనది నా దేశం కోసం ఒక కఫన్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది ఓ దేశమా! మేము నీ బిడ్డలమే నీ అభ్యుదయం అభివృద్ధే మా ధ్యేయం కలిమిలోనూ లేమిలోనూ మా హృదయానికి ఊరట నువ్వు భరత మాత బిడ్డల్లారా! ధైర్యంగా నడుం బిగించండి నక్కలు తోడేళ్ళు తోక ముడిచేలా మెరుపుదాడి చేయండి మన బంగరు భవితకు మనమే దారులు వేసుకోవాలి మన దేశ సమస్యల సుడిగుండాల్ని మనమే దాటాలి ప్రాణాలను పుణ్యపుడమి కోసం తృణప్రాయంగా ఇచ్చెయ్యాలి ప్రపంచమే మెచ్చుకునేలా మనలో చైతన్య స్ఫూర్తి నిండాలి మనిషి బతకాలి మానవత్వం వర్ధిల్లాలి!

Comments

Popular posts from this blog

జై కొట్టు... మీసం మెలి పెట్టు

చాలా చీకటిగా ఉంది

మనిషి మహా ఆత్రగాడు